Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబు ఇంటి గేట్లను తాళ్లతో కట్టేసిన పోలీసులు!

  • చంద్రబాబును హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
  • గేటు లోపలే పలువురు నేతలు
  • పోలీసులకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణుల నినాదాలు
ఉండవల్లిలోని నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన బయటకు రాకుండా గేట్లు వేసిన పోలీసులు... గేట్లను తాళ్లతో కట్టేశారు. గేటు వెలుపల భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. గేటు లోపల చంద్రబాబు, నారా లోకేశ్ తో పాటు పలువురు కీలక నేతలు, పార్టీ శ్రేణులు, మీడియా ప్రతినిధులు ఉన్నారు.

ఇంటి నుంచి బయటకు రావడానికి చంద్రబాబు తన వాహనంలో కూర్చున్నప్పటికీ... పోలీసులు గేటు తీయలేదు. ఈ నేపథ్యంలో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నినాదాలు చేస్తున్నాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తనను ఇంట్లో పెట్టి 'ఛలో ఆత్మకూరు' కార్యక్రమాన్ని ఆపలేరని మండిపడ్డారు.
Chandrababu
House Arrest
Telugudesam

More Telugu News